ఆదిమూలపు కేసు 21కి వాయిదా
ABN , First Publish Date - 2021-09-17T09:28:52+05:30 IST
ఐఆర్‌ఎస్ మాజీ అధికారి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆయన భార్య, ఐఆర్‌ఎస్ మాజీ అధికారిణి విజయలక్ష్మికి ..
న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఐఆర్‌ఎస్ మాజీ అధికారి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, ఆయన భార్య, ఐఆర్‌ఎస్ మాజీ అధికారిణి విజయలక్ష్మికి సంబంధించిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసుపై గురువారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తులు జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ విక్రమ్‌నాఽథ్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన ధర్మాసనం విచారించింది. ఆదిమూలపు దంపతుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ బాత్ర వాదనలు వినిపించారు. అనంతరం కేసు విచారణను కోర్టు ఈనెల 21కి వాయిదా చేసింది.