పరిహారం చెల్లింపుల్లో వివక్ష తగదు: సుప్రీంకోర్టు

ABN , First Publish Date - 2021-07-08T07:59:07+05:30 IST

భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకే భూసేకరణ నోటిఫికేషన్‌లో ఉన్న అందరికీ ఒకే రకంగా పరిహారం చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపింది

పరిహారం చెల్లింపుల్లో వివక్ష తగదు: సుప్రీంకోర్టు

న్యూఢిల్లీ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): భూసేకరణకు సంబంధించిన పరిహారం చెల్లింపుల్లో వివక్ష చూపరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకే భూసేకరణ నోటిఫికేషన్‌లో ఉన్న అందరికీ ఒకే రకంగా పరిహారం చెల్లించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో తెలుగు గంగా ప్రాజెక్టులో భాగంగా ‘సోమశిల-కండలేరు’లో 1990ల్లో సేకరించిన భూముల్లో ఉన్న దానిమ్మ చెట్లకుగాను నిర్వాసితులకు వేర్వేరు మొత్తాల్లో పరిహారం చెల్లించడాన్ని సవాలు చేస్తూ పలువురు దాఖలు చేసిన పిటిషన్లు బుధవారం సుప్రీంకోర్టు ఎదుట విచారణకు వచ్చాయి. జస్టిస్‌ ఏ ఎం ఖన్విల్కర్‌, జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపి... పిటిషనర్లకు సానుకూలంగా తీర్పును వెలువరించింది.  

Updated Date - 2021-07-08T07:59:07+05:30 IST