పురుగుల మందుతాగి ముగ్గురు ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-01-12T21:55:48+05:30 IST
పురుగుల మందుతాగి ముగ్గురు ఆత్మహత్య

పశ్చిమగోదావరి: జిల్లాలోని పాలకోడేరు మండలం కుముదవల్లిలో విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఏడాదిన్న బాబు సహా దంపతులు పరుశురాం, సావిత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమంటున్న బంధువులు తెలిపారు. ఈవిషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.