పరిశ్రమలకు స్థిర పెట్టుబడిలో రాయితీ

ABN , First Publish Date - 2021-05-18T09:19:47+05:30 IST

ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నూతన ఎలక్ర్టానిక్స్‌ విధానానికి సంబంధించిన విధి విధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

పరిశ్రమలకు స్థిర పెట్టుబడిలో రాయితీ

  • అత్యధికంగా 20-25 కోట్ల వరకు ఇస్తారు
  • ఐదేళ్లు విద్యుత్‌ చార్జీలు తగ్గింపు
  • ఎలక్ర్టానిక్స్‌ విధానం 2021-2024 ఉత్తర్వులు జారీ 


అమరావతి, (ఆంధ్రజ్యోతి): ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించిన నూతన ఎలక్ర్టానిక్స్‌ విధానానికి సంబంధించిన విధి విధానాలను నిర్దేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీని ప్రకారం ఐటీ, ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమలు నెలకొల్పేవారికి...స్థిర పెట్టుబడిలో 20శాతం...గరిష్ఠంగా రూ.20 కోట్ల వరకు రాయితీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు 25 శాతం...గరిష్ఠంగా 25శాతం రాయితీని ఇస్తూ నూతన ఎలకా్ట్రనిక్స్‌ విధానం 2021-2024ను రూపొందించారు. వాణిజ్య ఉత్పత్తి ప్రారంభ మైన తేదీ నుంచి ఐదేళ్లపాటు విద్యుత్‌ చార్జీల్లో యూనిట్‌కు రూపాయి చొప్పున రీయింబర్స్‌మెంట్‌, కేటాయించిన స్థలంపై స్టాంప్‌డ్యూటీ మినహాయింపు ఇస్తారు. దేశీయ రవాణాకు ఆ పరిశ్రమ ఖర్చుచేసిన మొత్తంలో 25శాతం..గరిష్థంగా రూ.50 లక్షలు తిరిగి చెల్లిస్తారు. విదేశాల్లో ఉన్న ఎలక్ర్టానిక్స్‌ ప్లాంట్లను రాష్ట్రానికి తరలిస్తామంటే ఈ రవాణా సబ్సిడీ రూ.2కోట్ల వరకు రీయింబర్స్‌ చేస్తారు. పెట్టుబడి పెట్టే కంపెనీలకు ఐదుశాతం వరకు వడ్డీ రాయితీ, గరిష్ఠంగా రూ.1.5 కోట్ల వరకు ఐదేళ్లపాటు అందిస్తారు. అన్ని ఎలక్ర్టానిక్స్‌ పరిశ్రమల్లోను మూడుషిఫ్టుల పనికి, మహిళలు రాత్రి షిఫ్టులో పనిచేసేందుకు అనుమతిస్తారు.


అయితే వారికి తగిన రక్షణ ఏర్పాట్లను కంపెనీ చేయాలి. ఎస్‌జీఎ్‌సటీలో రాయితీలిస్తారు. మొబైల్‌ ఫోన్లు, ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాలు, ఇండస్ర్టియల్‌ ఎలక్ర్టానిక్స్‌, కన్జ్యూమర్‌ ఎలక్ర్టానిక్స్‌ తదితర రంగాల్లో భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడం నూతన విధానం లక్ష్యంగా ఐటీ శాఖ కార్యదర్శి జయలక్ష్మి సోమవారం జారీచేసిన ఈ  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎలక్ర్టానిక్స్‌ విడిభాగాలను అసెంబ్లింగ్‌ చేసే స్థాయి నుంచి రాష్ట్రాన్ని ఎలక్ర్టానిక్స్‌ పరికరాల తయారీ రంగ హబ్‌గా తయారుచేయాలన్నది ఈ విధానం ప్రధాన ఉద్దేశమని వివరించారు. 

Updated Date - 2021-05-18T09:19:47+05:30 IST