శ్రీవారి హుండీలో చోరీ.. అదుపులో ముగ్గురు

ABN , First Publish Date - 2021-03-24T09:16:18+05:30 IST

శ్రీవారి హుండీలో చోరీ.. అదుపులో ముగ్గురు

శ్రీవారి హుండీలో చోరీ.. అదుపులో ముగ్గురు

తిరుమల, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలోని హుండీలో చోరీకి పాల్పడిన ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని రూ.20 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం వీరిలో ఒకరు హుండీలో కానుకలు వేస్తున్నట్టు నటించి ముందున్న భక్తులు వేసిన నగదును హుండీలో పడకముందే పట్టుకుని మరో యువకుడికి అందజేశాడు. వన్‌టౌన్‌ బీట్‌ పోలీసులు, విజిలెన్స్‌ సిబ్బంది ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు వచ్చిన మరో వ్యక్తిని కూడా ఆలయం వెలుపల పట్టుకున్నారు. 

Updated Date - 2021-03-24T09:16:18+05:30 IST