రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2021-12-09T08:44:44+05:30 IST

‘‘వైసీపీ ప్రభుత్వం కాసుల కక్కుర్తితో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చింది. కాపురాల్లో

రాష్ట్రాన్ని  మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు:  తులసిరెడ్డి

వేంపల్లె, డిసెంబరు 8: ‘‘వైసీపీ ప్రభుత్వం కాసుల కక్కుర్తితో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చింది. కాపురాల్లో మద్యం చిచ్చుపెడుతోంది. మానవ సంబంధాలు ధ్వంసమైపోతున్నాయి. దశలవారీ మద్యాన్ని నిషేధిస్తాం అని మేనిఫెస్టోలో ప్రకటించిన వైసీపీ అధికారంలోకి వచ్చాక మద్యాన్ని ఆదాయ వనరుగా భావించి దశలవారీ ‘మద్య నిషా పథకాన్ని’ అమలు చేస్తోంది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వేంపల్లెలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.   జిల్లాల వారీగా, వారాల వారీగా మద్యం ఆదాయానికి ప్రభుత్వం లక్ష్యాలు నిర్దేశిస్తోందన్నారు.  


Updated Date - 2021-12-09T08:44:44+05:30 IST