శ్రీగిరిపై లక్ష దీపోత్సవం

ABN , First Publish Date - 2021-11-09T07:19:05+05:30 IST

కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం నిర్వహించింది.

శ్రీగిరిపై లక్ష దీపోత్సవం

శ్రీశైలం, నవంబరు 8: కార్తీకమాసం మొదటి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో పుష్కరిణి వద్ద దేవస్థానం లక్ష దీపోత్సవం నిర్వహించింది. పుష్కరిణికి దశవిధ హారతులు సమర్పించింది. అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం పుష్కరిణికి హారతులు సమర్పించారు. భక్తులు పెద్ద ఎత్తున శ్రీశైలానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. శ్రీగిరి క్షేత్రం భక్తల శివనామస్మరణతో మార్మోగింది. 


Updated Date - 2021-11-09T07:19:05+05:30 IST