కరోనా పరిస్థితులు చక్కబడాలి

ABN , First Publish Date - 2021-10-31T09:45:26+05:30 IST

కరోనా పరిస్థితులు చక్కబడాలి

కరోనా పరిస్థితులు చక్కబడాలి

ఏపీ, మిజోరాం గవర్నర్ల ఆకాంక్ష..

హరిచందన్‌ను కలిసిన హరిబాబు


అమరావతి, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా పరిస్థితులు చక్కబడాలని ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌, మిజోరాం గవర్నర్‌ కంభంపాటి హరిబాబు ఆకాంక్షించారు. శనివారం విజయవాడలోని రాజ్‌భవన్‌లో హరిచందన్‌ను హరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా స్వాగతం పలికారు. భేటీ అనంతరం హరిచందన్‌ను మిజోరాం సంప్రదాయాలతో హరిబాబు సత్కరించారు. ఏపీ గవర్నర్‌ కూడా ఏపీ సంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా హరిబాబును సత్కరించి, వేంకటేశ్వర స్వామి ప్రతిమను బహుకరించారు. అనంతరం ఇరువురూ సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మిజోరాంలో పర్యటించాలని హరిచందన్‌ను హరిబాబు ఆహ్వానించారు. 

Updated Date - 2021-10-31T09:45:26+05:30 IST