ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములకు ప్రత్యేక పరిహారం
ABN , First Publish Date - 2021-05-20T09:19:01+05:30 IST
ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ప్రజా అవసరాలకు సేకరిస్తే వారికి అదనంగా 10 శాతం ప్రత్యేక పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను ప్రజా అవసరాలకు సేకరిస్తే వారికి అదనంగా 10 శాతం ప్రత్యేక పరిహారం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన డీ-పట్టా భూము లను ప్రభుత్వం ప్రాజెక్టులు, ఇంటి స్థలాల కోసం సేకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో కాలంగా ఆ భూములపై ఆధారపడిన ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా చితికిపోయి ఏ ఆధారాల్లేకుండా ఉన్నారని ప్రభుత్వం గుర్తించింది. వారికి ఆర్‌ఎ్‌ఫటీఎల్‌ఏఆర్‌ఆర్ యాక్ట్ 2013 ప్రకారం నష్టపరిహారం అందించినప్పటికీ అదనంగా మరో 10 శాతం పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.