టీటీడీ బోర్డు సభ్యులతో తొమ్మిది ప్రత్యేక కమిటీల ఏర్పాటు
ABN , First Publish Date - 2021-11-13T01:32:30+05:30 IST
టీటీడీ పాలకమండలిలోని సభ్యులను తొమ్మిది కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ పాలకమండలి తీర్మానం చేసిన నేపథ్యంలో టీటీడీ

తిరుపతి: టీటీడీ పాలకమండలిలోని సభ్యులను తొమ్మిది కమిటీల్లో సభ్యులుగా నియమిస్తూ పాలకమండలి తీర్మానం చేసిన నేపథ్యంలో టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ కమిటీలో నారాయణస్వామి శ్రీనివాసన్, రాజేశ్ కుమార్ శర్మ, బండి పార్థసారథి రెడ్డి, ఎఫ్ఏ అండ్ సీఏవో సభ్యులుగా ఉంటారు. పర్చేజింగ్ కమిటీలో రామేశ్వరరావు, మారుతి ప్రసాద్, సనత్ కుమార్, ఎఫ్ఏ అండ్ సీఏవో, ప్రొక్యూర్మెంట్ జీఎం సభ్యులుగా ఉంటారు.ఇంజనీరింగ్ వర్క్స్ కమిటీలో శశిధర్, లక్ష్మీనారాయణ, మధుసూదన్ యాదవ్, ఎఫ్ఏ అండ్ సీఏవో, చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉంటారు. ఎస్టేట్ కమిటీలో పోకల అశోక్ కుమార్, మల్లాడి కృష్ణారావు, జీవన్ రెడ్డి, అదనపు ఈవో, టీటీడీ లా ఆఫీసర్, ఎస్టేట్ ఆఫీసర్ సభ్యులుగా ఉంటారు.
అప్పీల్స్ కమిటీలో సంజీవయ్య, కృష్ణమూర్తి వైద్యనాథన్,ఎండోమెంట్ కమిషనర్ హరిజవహర్ లాల్ ,బోర్డు సెల్ డిప్యూటీ ఈవో సభ్యులుగా ఉంటారు. మెడికల్ కమిటీలో శంకర్, కేతన్ దేశాయ్, చెవిరెడ్డి భాస్కర రెడ్డి, టీటీడీ జేఈవో, చీఫ్ మెడికల్ ఆఫీసరు సభ్యులుగా ఉంటారు. హిందుధర్మప్రచార పరిషత్ కమిటీ సభ్యులుగా టీటీడీ ఛైర్మన్, ఈవో, ఎండోమెంట్ కమిషనర్, జేఈవో, బోర్డు సభ్యులు మళ్లీశ్వరి,రాములు, కల్వకుంట విద్యాసాగర రావు, ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి సభ్యులుగా ఉంటారు. ఎస్వీబీసీ ఛానల్ కమిటీ సభ్యులుగా మధుసూదన్ యాదవ్, విశ్వనాథ్, నందకుమార్, అదనపు ఈవో, ఎస్వీబీసీ సీఈవో సభ్యులుగా ఉంటారు. ఎడ్యుకేషన్ కమిటీ సభ్యులుగా కాటసాని రాంభూపాల్ రెడ్డి, మిలింద్ కేశవ్ నర్వేకర్, జేఈవో సభ్యులుగా ఉంటారు.