రూ.300 దర్శన టికెట్ల కోసం భక్తుల పాట్లు

ABN , First Publish Date - 2021-08-25T09:11:23+05:30 IST

తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకునేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. సెప్టెంబరు మాసానికి

రూ.300 దర్శన టికెట్ల కోసం భక్తుల పాట్లు

తిరుమల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు బుక్‌ చేసుకునేందుకు భక్తులు ఇబ్బంది పడ్డారు. సెప్టెంబరు మాసానికి సంబంధించిన కోటాను మంగళవారం ఉదయం 9 గంటలకు రోజుకు 8వేల చొప్పున టికెట్లను విడుదల చేశారు. భక్తులు ఈ టికెట్లను బుక్‌ చేసుకునేందుకు పోటీపడటంతో ఈసారీ టీటీడీ వెబ్‌సైట్‌ మొరాయించింది. కొందరికి వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదు. మరికొందరికి వివరాల నమోదు పూర్తయినా పేమెంట్‌ పూర్తికాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ ఉన్నవారు గంట వ్యవధిలోనే టికెట్ల కోటా మొత్తాన్ని బుక్‌ చేసుకున్నారు.

Updated Date - 2021-08-25T09:11:23+05:30 IST