సోనీవుడ్‌ను ఏపీపీఎస్సీ నుంచి తొలగించాలి: గొల్లపల్లి

ABN , First Publish Date - 2021-07-12T08:21:32+05:30 IST

క్రిస్టియన్‌ మతాధికుడు సోనీవుడ్‌ నూతలపాటిని ఏపీపీఎస్సీ సభ్యుని పదవి నుంచి తొలగించాలని టీడీపీ ఉపాధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.

సోనీవుడ్‌ను ఏపీపీఎస్సీ నుంచి తొలగించాలి: గొల్లపల్లి

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): క్రిస్టియన్‌ మతాధికుడు సోనీవుడ్‌ నూతలపాటిని ఏపీపీఎస్సీ సభ్యుని పదవి నుంచి తొలగించాలని టీడీపీ ఉపాధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు రాష్ట్ర గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గవర్నర్‌కు ఆయన ఆదివారం లేఖ రాశారు. సోనీవుడ్‌ సామాజిక వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొడుతున్నారని ఫిర్యాదు చేశారు. తక్షణం విచారణ జరిపి, గౌరవ ప్రదమైన ఏపీపీఎస్సీ పదవి నుంచి వెంటనే ఆయనను తొలగించాలని గొల్లపల్లి కోరారు. 

Updated Date - 2021-07-12T08:21:32+05:30 IST