బెజవాడలోని ముఖ్య కూడళ్లలో ఆర్చ్‌లు నిర్మిస్తాం: దుర్గగుడి చైర్మన్
ABN , First Publish Date - 2021-03-24T21:55:59+05:30 IST
బెజవాడలోని ముఖ్య కూడళ్లలో ఆర్చ్‌లు నిర్మిస్తాం: దుర్గగుడి చైర్మన్

విజయవాడ: దుర్గగుడి పాలకమండలి సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు మాట్లాడారు. 38 అంశాలకుగాను 36 అంశాలు ఆమోదించామన్నారు. 178 కోట్లతో ఈ ఏడాది దుర్గమ్మ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. బెజవాడలోని ముఖ్య కూడళ్లలో ఆర్చ్‌లు నిర్మిస్తామని తెలిపారు. విజయవాడ మీదుగా వెళ్లే ఒక రైలుకు కనకదుర్గ ఎక్స్‌ప్రెస్‌గా నామకరణం చేయాలని కోరనున్నామని చెప్పారు. రోజుకు 5 వేల మందికి అన్నదానం చేస్తామని తెలిపారు.