రామతీర్థంలో ‘సిట్’ దర్యాప్తు ప్రారంభం
ABN , First Publish Date - 2021-01-12T08:30:13+05:30 IST
విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం విచారణను ప్రారంభించింది.

నెల్లిమర్ల, జనవరి 11: విజయనగరం జిల్లాలోని రామతీర్థంలో విగ్రహాల ధ్వంసం ఘటనకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సోమవారం విచారణను ప్రారంభించింది. ఘటన జరిగిన బోడికొండ పరిసర ప్రాంతాలను బృందం సభ్యులు క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ లభించిన చిన్నపాటి ఆధారాలను సైతం సేకరించి భద్రపరిచారు.