సిగ్నల్స్‌ అందక గాల్లో విమానం చక్కర్లు

ABN , First Publish Date - 2021-10-07T09:43:45+05:30 IST

గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన అంతర్జాతీయ విమానం ప్రతికూల వాతావరణంతో సిగ్నల్స్‌ అందకపోవడంతో మచిలీపట్నం ప్రాంతంలో పది రౌండ్లు చక్కర్లు కొట్టింది.

సిగ్నల్స్‌ అందక గాల్లో విమానం చక్కర్లు

గన్నవరంలో దిగకుండా మచిలీపట్నానికి..

తర్వాత వెనక్కి వచ్చి సురక్షితంగా ల్యాండింగ్‌ 

గన్నవరం, అక్టోబరు 6: గన్నవరం విమానాశ్రయానికి రావాల్సిన అంతర్జాతీయ విమానం ప్రతికూల వాతావరణంతో సిగ్నల్స్‌ అందకపోవడంతో మచిలీపట్నం ప్రాంతంలో పది రౌండ్లు చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సిగ్నల్స్‌ అందడంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో సురక్షితంగా ల్యాండయింది. కౌలాలంపూర్‌ నుంచి 165 మంది ప్రమాణికులతో బయలుదేరిన ఎయిరిండియా విమానం బుధవారం సాయంత్రం 5.20 గంటలకు గన్నవరం వచ్చి, 5.50 గంటలకు బయలుదేరాలి. వాతావరణం అనుకూలించక 5.50 గంటలకు ల్యాండ్‌ అయింది. 6.30 గంటలకు హైదరాబాద్‌ బయల్దేరి వెళ్లింది. గన్నవరంలో 61 మంది ప్రయాణికులు దిగారు. 

Updated Date - 2021-10-07T09:43:45+05:30 IST