రాష్ట్రం ‘అదాని’ ప్రదేశ్‌గా మారుతోంది: శైలజానాథ్
ABN , First Publish Date - 2021-10-30T01:59:12+05:30 IST
రాష్ట్రంలోని విలువైన వనరులను అదానీకి దోచిపెడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అదానీ ఆంధ్రప్రదేశ్‌గా

గుంటూరు: రాష్ట్రంలోని విలువైన వనరులను అదానీకి దోచిపెడుతూ సీఎం జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని అదానీ ఆంధ్రప్రదేశ్‌గా మారుస్తోన్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ధ్వజమెత్తారు. గుంటూరు రాజీవ్‌గాంధీభవన్‌లో శుక్రవారం జరిగిన బంగ్లాదేశ్ స్మారక విమోచన దినోత్సవానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రాజకీయాలు అధ్వాన్నంగా తయారయ్యాయన్న ఆయన అధికార, ప్రతిపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని విమర్శించారు. దేశభక్తి ముసుగులో కేంద్రంలోని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ కుల,మతాల మధ్య చిచ్చుపెడుతున్నాయని మండిపడ్డారు. బీజేపీ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. దేశభక్తితో ముందుకు సాగే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని శైలజానాథ్ స్పష్టం చేశారు.