సీతారామ శాస్త్రికి తీవ్ర అస్వస్థత

ABN , First Publish Date - 2021-11-28T07:17:37+05:30 IST

సీతారామ శాస్త్రికి తీవ్ర అస్వస్థత

సీతారామ శాస్త్రికి తీవ్ర అస్వస్థత

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాదపడుతున్నారని.. రెండు రోజుల క్రితం నిమోనియాతో బాధపడుతూ ఆస్పత్రికిలో చేరానని కిమ్స్‌ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన్ను ఐసీయూలో ఉంచి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించాయి. గత 24 గంటలుగా ఆయన పరిస్థితి నిలకగా ఉందని పేర్కొన్నాయి. ఈ విషయమై సిరివెన్నెల తనయుడు యోగి స్పందించారు. ‘‘నాన్నగారు క్షేమంగానే ఉన్నారు. కంగారు పడాల్సిన అవసరం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.  

Updated Date - 2021-11-28T07:17:37+05:30 IST