తిరుమలలో మొరాయించిన సర్వర్లు

ABN , First Publish Date - 2021-03-14T09:47:55+05:30 IST

తిరుమలలో సర్వర్లు మొరాయించడంతో భక్తులకు అసౌర్యం ఏర్పడింది. గదుల కేటాయింపు కేంద్రాలతో పాటు చైర్మన్‌ కార్యాలయం,

తిరుమలలో మొరాయించిన సర్వర్లు

తిరుమల, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తిరుమలలో సర్వర్లు మొరాయించడంతో భక్తులకు అసౌర్యం ఏర్పడింది. గదుల కేటాయింపు కేంద్రాలతో పాటు చైర్మన్‌ కార్యాలయం, బోర్డు సెల్‌లో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి టీటీడీ సేవలు నిలిచిపోయాయి. సర్వర్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో అన్ని రకాల సేవలకు అంతరాయం ఏర్పడంది. దీంతో గదుల కోసం, రూ.300 దర్శన టికెట్ల కోసం వచ్చిన భక్తులు గంటల తరబడి కుటుంబ సభ్యులతో నిరీక్షించాల్సి వచ్చింది. సాంకేతిక సిబ్బంది సాయంత్రం 6 గంటలకు సర్వర్లు పనిచేసేలా చర్యలు తీసుకున్నారు.

Updated Date - 2021-03-14T09:47:55+05:30 IST