రూ.కోటి స్వాధీనం

ABN , First Publish Date - 2021-02-01T09:36:32+05:30 IST

ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న కోటి రూపాయాల నగదును రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు గరికపాడు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

రూ.కోటి స్వాధీనం

జగ్గయ్యపేటరూరల్‌, జనవరి 31: ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న కోటి రూపాయాల నగదును రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టు గరికపాడు వద్ద ఆదివారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి తెలిపిన వివరాలమేరకు.. తెలంగాణ నుంచి బస్సులో ఇద్దరు వ్యక్తులు గోనెసంచుల్లో డబ్బు తీసుకొస్తున్న సమాచారంతో పోలీసులు తనిఖీ చేసి నగదును స్వాధీనం చేసుకున్నారు. నాగర్‌కర్నూలుకు చెందిన రాయల సత్యనారాయణ, శ్రావణ్‌ కుమార్‌లను అదుపులోకి తీసుకున్నారు. అయితే, నాగర్‌కర్నూలులో తమకు ఉన్న 16 ఎకరాల భూమిని విక్రయించి నూజివీడు మండలం సుంకొల్లులో ఉంటున్న కుమారుల వద్దకు వస్తున్నట్టు వారు చెప్పారు.

Updated Date - 2021-02-01T09:36:32+05:30 IST