బూతులు మాట్లాడే వారికి ప్రజల సొమ్ముతో భద్రతా!!: విష్ణుకుమార్‌రాజు

ABN , First Publish Date - 2021-11-26T09:25:38+05:30 IST

బూతులు మాట్లాడే వారికి ప్రజల సొమ్ముతో భద్రతా!!: విష్ణుకుమార్‌రాజు

బూతులు మాట్లాడే వారికి ప్రజల సొమ్ముతో భద్రతా!!: విష్ణుకుమార్‌రాజు

విశాఖపట్నం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పనితీరు ఆక్షేపణీయంగా ఉంది. ఆయన నిర్ణయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చంద్రబాబును నానా విధాలుగా దూషించి, నిత్యం బూతులు మాట్లాడుతున్న వైసీపీ నాయకులకు ప్రజల సొమ్ముతో అదనపు భద్రత కల్పించడం ఏ రకమైన న్యాయం?’’ అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించారు. ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మహిళలంతా ఆ నాయకులను చూసి చీదరించుకుంటున్నారన్నారు. అటువంటి వ్యక్తులను బూతులు మాట్లాడవద్దని హెచ్చరించడమో, పదవులను నుంచి తప్పించడమో చేయాలన్నారు. కానీ, ఇలా అదనపు భద్రతను కల్పించడం చూస్తుంటే.. వారిని పరోక్షంగా సీఎం మరింత ప్రోత్సహిస్తున్నట్టుగా ఉందన్నారు. తుఫాన్లు, వరదలు రావ డం సహజమేనని, ఆ సమయంలో సీఎం స్పందించాల్సిన తీరు కూడా ప్రత్యేకంగా ఉంటుందని అన్నారు. కానీ జగన్‌ తనకేమీ పట్టనట్టు వ్యహరించడం బాధ కలిగిస్తోందన్నారు.  

Updated Date - 2021-11-26T09:25:38+05:30 IST