నేటి నుంచి ఐఎంఏ వైద్యుల దీక్షలు

ABN , First Publish Date - 2021-02-01T11:58:42+05:30 IST

ఆయుర్వేద వైద్యులు కూడా ఆధునిక శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతించే కేంద్ర ప్రభుత్వ విధానంపై భారత వైద్య సంఘం (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోం

నేటి నుంచి ఐఎంఏ వైద్యుల దీక్షలు

అమరావతి: ఆయుర్వేద వైద్యులు కూడా ఆధునిక శస్త్రచికిత్సలు చేసేందుకు అనుమతించే కేంద్ర ప్రభుత్వ విధానంపై భారత వైద్య సంఘం (ఐఎంఏ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నుంచి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర, జిల్లా కేంద్రాల్లో రిలే నిరాహార దీక్షలు చేపట్టాలని ఐఎంఏ కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ మేరకు రాష్ట్రంలో రిలే నిరాహార దీక్షలకు దిగుతున్నామని ఐఎంఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గార్లపాటి నందకిషోర్‌ ఆదివారం వెల్లడించారు. 

Updated Date - 2021-02-01T11:58:42+05:30 IST