కార్పొరేటర్ ఖర్చు 2లక్షలే!
ABN , First Publish Date - 2021-02-26T08:07:00+05:30 IST
వచ్చే నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితులను నిర్దేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది...

- ‘మున్సిపోల్స్’ అభ్యర్థుల ఎన్నికల
- వ్యయ పరిమితులు ఖరారు
అమరావతి, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే నెల 10న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల వ్యయ పరిమితులను నిర్దేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం నగర పాలక సంస్థల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల వ్యయ పరిమితి.. ఒక్కొక్కరికీ.. రూ.2 లక్షలు, పురపాలక సంఘాల్లో రూ.1.50 లక్షలు, నగర పంచాయతీల్లో అయితే రూ.లక్ష మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులందరూ నాలుగురోజులకోసారి రోజువారీ ఖర్చు వివరాలను పట్టణ స్థానిక సంస్థల రిటర్నింగ్ అధికారులకు విధిగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు పురపాలక శాఖకు ఎస్ఈసీ ఆదేశాలు పంపింది.