అక్కడంతా ఎస్సీలే.. కానీ అది అన్‌రిజర్వుడు!

ABN , First Publish Date - 2021-02-05T07:52:16+05:30 IST

ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. కానీ.. ఆ గ్రామాల్లో ఓటర్లంతా ఎస్సీ సామాజికవర్గం వారే.

అక్కడంతా ఎస్సీలే.. కానీ అది అన్‌రిజర్వుడు!

ప్రకాశం జిల్లా అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లోని రెండు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించారు. కానీ.. ఆ గ్రామాల్లో ఓటర్లంతా ఎస్సీ సామాజికవర్గం వారే. అద్దంకి మండలంలోని విప్పర్లవారిపాలెంలో మొత్తం 489 మంది ఓటర్లున్నారు. సర్పంచ్‌ పదవి అన్‌రిజర్వ్‌డ్‌ మహిళకు కేటాయించారు. ఓటర్లందరూ ఎస్సీలే కావడంతో ఆ సామాజికవర్గానికి చెందిన మహిళలే బరిలో నిలుస్తున్నారు. పర్చూరు నియోజకవర్గంలోని మార్టూరు మండలం లక్కవరం గ్రామంలోని 647 మంది ఓటర్లంతా ఎస్సీలే. ఇక్కడా సర్పంచ్‌ పదవిని అన్‌రిజర్వ్‌డ్‌కు కేటాయించగా.. ఎస్సీలే అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. ఈ నెల 9న జరిగే ఎన్నికల్లో ఎస్సీలే సర్పంచ్‌, వార్డు సభ్యులుగా ఎన్నిక కానున్నారు.

- అద్దంకి

Updated Date - 2021-02-05T07:52:16+05:30 IST