శానిటైజర్‌ పేలి విద్యార్థికి గాయాలు

ABN , First Publish Date - 2021-05-30T09:06:55+05:30 IST

చెత్తలో పారేసిన శానిటైజర్‌ పేలి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం కడప జిల్లా జమ్మలమడుగులో ఈ ప్రమాదం జరిగింది

శానిటైజర్‌ పేలి విద్యార్థికి గాయాలు

జమ్మలమడుగు రూరల్‌, మే 29: చెత్తలో పారేసిన శానిటైజర్‌ పేలి ఓ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం కడప జిల్లా జమ్మలమడుగులో ఈ ప్రమాదం జరిగింది. పట్టణంలోని భాగ్యనగర్‌ కాలనీకి చెందిన జయబూన్‌బీ కుమారుడు(12) స్థానిక జడ్పీ హైస్కూల్లో 6వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవులు ఇవ్వడంతో స్నేహితులతో కలసి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో చెత్తలో ఉన్న శానిటైజర్‌ను అతను తొక్కడంతో అది పేలి నిప్పంటుకుంది. వెంటనే 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం ప్రొద్దుటూరుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-05-30T09:06:55+05:30 IST