ఎనిమిది నెలల తర్వాత జలదిగ్బంధం నుంచి బయటపడిన సంగమేశ్వరాలయం
ABN , First Publish Date - 2021-03-21T09:53:40+05:30 IST
నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద ఏపీ సరిహద్దులో గల సప్తనదుల సంగమేశ్వరాలయం 8 నెలల తర్వాత కృష్ణానది జల దిగ్బంధం నుంచి బయటపడింది. గతేడాది జూలై

రేపటి నుంచి పూర్తి స్థాయిలో భక్తులకు దర్శనం
కొల్లాపూర్, మార్చి 20 : నాగర్‌కర్నూలు జిల్లా సోమశిల వద్ద ఏపీ సరిహద్దులో గల సప్తనదుల సంగమేశ్వరాలయం 8 నెలల తర్వాత కృష్ణానది జల దిగ్బంధం నుంచి బయటపడింది. గతేడాది జూలై 20న శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో మునిగిపోయిన ఈ ఆలయం 248 రోజుల తర్వాత శనివారం భక్తులకు దర్శనమిచ్చింది. ఈ క్షేత్రంలో పురాతన వేపధారు శివలింగం ఉంది.
తెలుగు రాష్ట్రాల సరిహద్దులో పారే కృష్ణానది తీరాన కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలతహారిని, భీమరసి, భవనాసి సప్తనదులు ఒకటిగా ఈ క్షేత్ర ప్రాంతంలో కలుస్తాయి. అందుకే ఈ ఆలయం సప్తనదుల సంగమేశ్వరాలయంగా ప్రసిద్ధి గాంచింది. కాగా ఆలయ గర్భగుడిలో ఇంకా నీరు ఉంది. సోమవారం నుంచి పూర్తి స్థాయిలో శివలింగం భక్తులకు దర్శనమివ్వనుంది.
