ఆంక్షలు రాష్ట్రానికేనా: పట్టాభి

ABN , First Publish Date - 2021-05-08T09:07:54+05:30 IST

‘‘పక్క రాష్ట్రాలు కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులకు ఆర్డర్‌ ఇస్తున్నాయి. వాటికి లేని ఆంక్షలు ఒక్క ఏపీకే వచ్చాయా! ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్లు తెప్పించాలని అడుగుతుంటే కేంద్రం ఒప్పుకోవడం లేదని సాకులు చూపి

ఆంక్షలు రాష్ట్రానికేనా: పట్టాభి

అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): ‘‘పక్క రాష్ట్రాలు కోట్ల సంఖ్యలో వ్యాక్సిన్‌ డోసులకు ఆర్డర్‌ ఇస్తున్నాయి. వాటికి లేని ఆంక్షలు ఒక్క ఏపీకే వచ్చాయా! ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్లు తెప్పించాలని అడుగుతుంటే కేంద్రం ఒప్పుకోవడం లేదని సాకులు చూపి తప్పించుకోవాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’’ అని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం శుక్రవారం విమర్శించారు. ‘‘ఏపీ ప్రభుత్వం కేవలం 13 లక్షల డోసులకు మాత్రమే ఆర్డర్‌ పెట్టింది.4 కోట్ల డోసులు అవసరం అయిన చోట ఇంత తక్కువ డోసులకు ఆర్డర్‌ పెట్టడం ఏమిటి? ఏ రాష్ట్రంపైనా పెట్టని ఆంక్షలను మన రాష్ట్రంపైనే పెట్టారా?’’ అని ప్రశ్నించారు. 

Updated Date - 2021-05-08T09:07:54+05:30 IST