జగన్ నిబద్ధతతో పదవులు ఇచ్చారు: సజ్జల

ABN , First Publish Date - 2021-06-21T23:02:47+05:30 IST

సీఎం జగన్ పూర్తిగా సామాజిక న్యాయం పాటిస్తూ ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారని వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.

జగన్ నిబద్ధతతో పదవులు ఇచ్చారు: సజ్జల

అమరావతి: సీఎం జగన్ పూర్తిగా సామాజిక న్యాయం పాటిస్తూ ఎమ్మెల్సీలకు అవకాశం కల్పించారని వైసీపీ సీనియర్ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని వర్గాలకు అవకాశం కల్పించాలని ఎస్సీ, బీసీ, ఓసీలకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారన్నారు. వైసీపీలో అందరూ నాయకులు జగన్మోహన్ రెడ్డి మనసెరిగినవారని చెప్పారు. ఎవరో జగన్‌కు చెప్పింది కాదని ఆయన నిబద్ధతతో పదవులు ఇచ్చారన్నారు. ఇదే విధంగా భవిష్యత్తులో పదవులు కేటాయింపు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్షం మండలిలో చిల్లర ఎత్తుగడలతో ప్రవర్తించేదన్నారు. మండలి రద్దు తీర్మానం వెనక్కి తీసుకోవడం లేదని అది ఎత్తుగడతో చేసింది కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-06-21T23:02:47+05:30 IST