నీ అంతు తేలుస్తాం!

ABN , First Publish Date - 2021-10-20T08:49:08+05:30 IST

‘ఏం.. ఏమనుకుంటున్నావ్‌.. మాకు చెప్పకుండా మా గ్రామ కార్యదర్శికి మెమో ఇస్తావా!? నీ సంగతి చూస్తాం.. నీ అంతు తేలు స్తాం..’ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎంపీడీవో నర్మదపై అధికార పార్టీ చోటానేతలు చేసిన బెదిరింపులివి.

నీ అంతు తేలుస్తాం!

మహిళా ఎంపీడీవోకు అధికారపార్టీ నేతల బెదిరింపు


సూళ్లూరుపేట, అక్టోబరు 19: ‘ఏం.. ఏమనుకుంటున్నావ్‌.. మాకు చెప్పకుండా మా గ్రామ కార్యదర్శికి మెమో ఇస్తావా!? నీ సంగతి చూస్తాం.. నీ అంతు తేలు స్తాం..’ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎంపీడీవో నర్మదపై అధికార పార్టీ చోటానేతలు చేసిన బెదిరింపులివి. బాధితురాలి కథనం మేరకు.. ఉగ్గుమూడి పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి సక్రమంగా పనిచేయడం లేదని ఫిర్యాదు రావడంతో ఆమెను పిలిపించి సంజాయిషీ కోరారు. దీనిపై అధికార పార్టీకి చెందిన ఆ గ్రామ సర్పంచి, ఆయన అనుచరులు సోమవారం సాయంత్రం ఎంపీడీవో కార్యాలయానికి వచ్చి నర్మదను బెదిరించారు. మనస్తాపం చెందిన ఆమె ఎమ్మెల్యే సంజీవయ్య వద్దకు వెళ్లి తనను బదిలీ చేయించాలని మొరపెట్టుకున్నట్టు సమాచారం. చివరకు ఎమ్మెల్యే ప్రమేయంతో.. ఉగ్గుమూడి సర్పంచ్‌ శ్రీనివాసులరెడ్డి ‘ఏదో జరిగిందిలే.. సారీ’ అంటూ ఎంపీడీవోకు చెప్పినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎంపీడీవో వివరణ కోరగా తనను బెదిరించారని చెప్పారు. 

Updated Date - 2021-10-20T08:49:08+05:30 IST