నేటి నుంచి ఏపీ టూ తెలంగాణకు ఆర్టీసీ బస్సులు

ABN , First Publish Date - 2021-06-21T12:06:21+05:30 IST

రెండో విడత లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఏపీఎస్ ఆర్టీసీ (ప్రజారవాణా-పీటీడీ) బస్సులను సోమవారం నుంచి తెలంగాణకు నడుపనున్నారు. పొరుగు రాష్ట్రం లాక్‌డౌన్‌ను

నేటి నుంచి ఏపీ టూ తెలంగాణకు ఆర్టీసీ బస్సులు

అమరావతి: రెండో విడత లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఏపీఎస్ ఆర్టీసీ (ప్రజారవాణా-పీటీడీ) బస్సులను సోమవారం నుంచి తెలంగాణకు నడుపనున్నారు. పొరుగు రాష్ట్రం లాక్‌డౌన్‌ను ఎత్తేయడంతో మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పగటిపూట మాత్రమే బస్సులు తిప్పుతామని, సుమారు 130 బస్సుల వరకూ అందుబాటులో ఉంటాయని ఆపరేషన్స్‌ విభాగం ఈడీ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. వివరాలను ఆన్‌లైన్‌లో చూసుకుని ప్రయాణికులు తమ టికెట్లు రిజర్వేషన్‌ చేసుకోవాలని సూచించారు. మరోవైపు.. కర్ణాటక, తమిళనాడులో ఉన్న పరిస్థితులపై ఆర్టీసీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న లాక్‌డౌన్‌ పరిస్థితులకు అనుగుణంగా మన బస్సులు పంపించాలో వద్దో  పరిశీలిస్తామని చెబుతున్నారు. 

Updated Date - 2021-06-21T12:06:21+05:30 IST