ఉరి వేసుకొని ఆర్ఎస్ఐ ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-12-31T01:33:36+05:30 IST

నగరంలో ఆర్ఎస్ఐ చంద్రరావు ఉరి వేసుకొని

ఉరి వేసుకొని ఆర్ఎస్ఐ ఆత్మహత్య

కడప: నగరంలో ఆర్ఎస్ఐ చంద్రరావు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.  శ్రీకాకుళం జిల్లాకు చెందిన చంద్రరావు ఆర్ఎస్ఐగా పని చేస్తున్నారు. సంఘటనా స్థలంలో మృతుడు రాసిన సూసైడ్ నోటును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉద్యోగం ఇష్టంలేక తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో చంద్రరావు పేర్కొన్నారు. ఇటీవల క్రికెట్ బెట్టింగ్‌లో భారీగా డబ్బులు పోగొట్టుకున్నానని.. అలా బెట్టింగ్ పెట్టడం తప్పుగా ఫీలయినట్లు ఆ లేఖలో మృతుడు రాశాడు.


ఇన్నాళ్లూ తాను కేవలం తల్లిదండ్రుల కోసం ఉద్యోగం చేస్తున్నట్లు లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. తన తండ్రి అనారోగ్యంతో ప్రస్తుతం ఆసుపత్రిలో వుండడం కూడా బాధగా ఉన్నట్లు  సూసైడ్ నోట్‌లో ప్రస్తావించాడు. సుదూర ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి ఇష్టంలేని ఉద్యోగం చేస్తున్నానని తన మనో వేదనను వ్యక్తం చేశాడు. 


Updated Date - 2021-12-31T01:33:36+05:30 IST