ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌

ABN , First Publish Date - 2021-01-13T16:57:13+05:30 IST

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌

అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఎండీగా ఆర్పీ ఠాకూర్‌‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ను ఆర్టీసీ వీసీ, ఎండీగా ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ప్రింటింగ్‌, స్టేషనరీ కమిషనర్‌గా ఉన్న ఆయనను.. ఆర్టీసీ ఎండీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.1986 బ్యాచ్‌కు చెందిన ఠాకూర్.. రాష్ట్ర డీజీపీగా, అంతకుముందు ఏసీబీ డీజీగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ ఠాకూర్ కీలక బాధ్యతలను నిర్వహించారు. 

Updated Date - 2021-01-13T16:57:13+05:30 IST