మే నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి
ABN , First Publish Date - 2021-10-29T10:03:51+05:30 IST
మే నాటికి రోడ్ల మరమ్మతులు పూర్తి
ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు
అమరావతి, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది మే నాటికి రాష్ట్రంలోని రహదారుల మరమ్మతులు పూర్తి చేస్తామని రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. గురువారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని రహదారుల మరమ్మతుల టెండర్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.2 వేల కోట్ల రుణం గురించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఆ రుణం మంజూరైందని కృష్ణబాబు సీఎంకు తెలిపారు. రోడ్ల మరమ్మతులకు సంబంధించిన 380 టెండర్లకు బిడ్‌లు దాఖలయ్యాయని, కాంట్రాక్టర్లకు పనులు అప్పగించామని, మిగతా టెండర్లు నవంబరు రెండో వారానికి పూర్తి చేస్తామని కృష్ణబాబు వివరించారు. వచ్చే ఏడాది మే నాటికి రహదారుల మరమ్మతులన్నీ పూర్తి చేస్తామన్నారు. అనంతరం ఆ విషయాలను కృష్ణబాబు మీడియాకు వివరించారు.