జేసీబీ ఢీకొని ముగ్గురు మహిళలు మృతి

ABN , First Publish Date - 2021-10-22T02:53:03+05:30 IST

జేసీబీ ఢీకొని ముగ్గురు మహిళలు మృతి

జేసీబీ ఢీకొని ముగ్గురు మహిళలు మృతి

కడప: జిల్లాలోని మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె దగ్గర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై కూర్చున్న నలుగురు మహిళా కూలీలను జేసీబీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మహిళలు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. జేసీబీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2021-10-22T02:53:03+05:30 IST