సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్‌ఐ అవినీతి బాగోతం

ABN , First Publish Date - 2021-08-22T00:45:49+05:30 IST

జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి భాగోతం బయటపడింది. కూడేరు

సోషల్‌ మీడియాలో వైరల్ అవుతున్న ఆర్‌ఐ అవినీతి బాగోతం

అనంతపురం: జిల్లాలో ఓ ప్రభుత్వ ఉద్యోగి అవినీతి భాగోతం బయటపడింది. కూడేరు మండల రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ శివారెడ్డి అవినీతి బాగోతం సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ రికార్డుల్లో భూమిని చేర్చేందుకు కమ్మూరు గ్రామానికి చెందిన ఓ రైతు నుంచి ఆర్ఐ శివారెడ్డి 10 వేలు లంచం తీసుకున్నాడు. రైతు నుంచి 10 వేలు డాక్యుమెంట్స్‌లో పెట్టి తీసుకుంటున్న వీడియో వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో బయటకు రావడంతో రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం రేగింది. దీంతో రైతును కార్యాలయానికి పిలిపించి తహశీల్దార్ విచారిస్తున్నారు. 

Updated Date - 2021-08-22T00:45:49+05:30 IST