విద్యార్థుల ఆత్మహత్యలపై 6 వారాల్లో నివేదిక ఇవ్వండి

ABN , First Publish Date - 2021-11-26T08:52:35+05:30 IST

విద్యార్థుల ఆత్మహత్యలపై 6 వారాల్లో నివేదిక ఇవ్వండి

విద్యార్థుల ఆత్మహత్యలపై 6 వారాల్లో నివేదిక ఇవ్వండి

ఏపీ సీఎస్ కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆదేశం

న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకుంటున్న చర్యలపై నివేదిక అందించకపోవడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్య, సైకాలజీ, కార్పొరేట్‌ రంగాల నిపుణులను సంప్రదించి తగిన చర్యలు తీసుకోవాలని, 6 వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. లేదంటే వ్యక్తిగతంగా హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించింది. విద్యార్థుల ఆత్మహత్యలపై 2018లో పలువురు ఫిర్యాదు చేయగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ జరుపుతోంది. 

Updated Date - 2021-11-26T08:52:35+05:30 IST