బాలిక మృతిపై విచారణ నివేదిక ఇవ్వండి

ABN , First Publish Date - 2021-10-19T08:12:24+05:30 IST

విశాఖ గాజువాక పరిధిలోని అంగనంపూడిలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక కేసుకు సంబంధించి విచారణ నివేదిక సమర్పించాలని రాష్ట్ర

బాలిక మృతిపై విచారణ నివేదిక ఇవ్వండి

  • విశాఖ సీపీకి మహిళా కమిషన్‌ ఆదేశం


అమరావతి, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): విశాఖ గాజువాక పరిధిలోని అంగనంపూడిలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన బాలిక కేసుకు సంబంధించి విచారణ నివేదిక సమర్పించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విశాఖ పోలీస్‌ కమిషనర్‌కు లేఖ రాశారు. బాలిక మృతి కేసులో ఇప్పటికే నమోదైన కేసును పరిశీలించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని ఆమె లేఖలో కోరారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Updated Date - 2021-10-19T08:12:24+05:30 IST