మాదిగల ‘సంక్షేమానికి’ తూట్లు

ABN , First Publish Date - 2021-09-07T08:25:37+05:30 IST

లిడ్‌క్యాప్‌... లెదర్‌ ఇండస్ర్టీస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, మాదిగల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. ఒకప్పుడు

మాదిగల ‘సంక్షేమానికి’ తూట్లు

లిడ్‌క్యాప్‌ ఎంప్యానల్‌మెంట్‌ నోటిఫికేషన్‌ విడుదల


(అమరావతి - ఆంధ్రజ్యోతి): లిడ్‌క్యాప్‌... లెదర్‌ ఇండస్ర్టీస్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌, మాదిగల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పాటు చేసింది. ఒకప్పుడు పరిశ్రమల శాఖలో భాగంగా ఉండేది. ఆ తరువాత సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోకి మార్చారు. ‘‘ఈ సంస్థ ద్వారా వచ్చే ఏ లబ్ధి అయినా మాదిగలకే చెందాలి. ఏవైనా వస్తువులు, సరుకులను లిడ్‌క్యాప్‌ కొనుగోలు చేయాలన్నా వాటిని మాదిగలకు చెందిన సరఫరా సంస్థల నుంచి మాత్రమే తీసుకోవాలి’’ అనే స్పష్టమైన నిబంధనలను ఏర్పాటు చేశారు. అందుకు పూర్తి భిన్నంగా, మాదిగల సంక్షేమమే అంతిమ లక్ష్యం... అన్న ప్రధాన నిబంధనకు తూట్లు పొడుస్తూ లిడ్‌క్యాప్‌ ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తనకు అవసరమైన ఉత్పత్తులను సరఫరా చేసేందుకు ఎంప్యానల్‌మెంట్‌ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.


దీనిలో కేవలం మాదిగలకు చెందిన సంస్థలు, కంపెనీలు మాత్రమే పాల్గొనాలన్న షరతును విస్మరించింది. ఇది ఎంప్యానల్‌మెంట్‌కు మాదిగలను దూరం చేయడమేనని విమర్శలు చెలరేగాయి. ప్రభుత్వం ఆ నోటిఫికేషన్‌ను సవరించి ఇవ్వాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-09-07T08:25:37+05:30 IST