పల్లెల్లో కరోనా నియంత్రణ చర్యలు
ABN , First Publish Date - 2021-05-20T09:34:24+05:30 IST
పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాలు, పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్ర్కీనింగ్, ఐసొలేషన్,

ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు విడుదల
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): పట్టణాలకు సమీపంలో ఉండే గ్రామాలు, పల్లెలు, గిరిజన ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. స్ర్కీనింగ్, ఐసొలేషన్, నియంత్రణతో పాటు బాధితులు రిఫరల్ వ్యవస్థను బలోపేతం చేసుకునేందుకు పాటించాల్సిన నియమాలను సిద్ధం చేసింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో వైద్య సౌకర్యాలు పెంచాలని సూచించింది. గ్రామాల్లో కొవిడ్ పరిస్థితిని ప్రతి రోజు సమీక్షించేందుకు గ్రామీణ స్థాయి కమిటీని నియమించింది. ప్రతి గ్రామంలో జ్వరంతో బాధపడుతున్న వారిని ముందుగా గుర్తించాలి. వారి ఆరోగ్య పరిస్థితి ఆశా వర్కర్లు, వలంటీర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రతి సబ్ సెంటరలో ప్రతి రోజు గంట పాటు పీవర్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. ఆశా వర్కర్లు, వలంటీర్లు ప్రతి రోజు ఇంటింటి సర్వే చేయాలి.
కొవిడ్ లక్షణాలున్నవారిని గుర్తించి వెంటనే హోం ఐసొలేషన్‌లోకి పంపించాలి. వారికి ఐసొలేషన్ కిట్స్‌ను 24 గంటల్లో ఏఎన్‌ఎం అందించాలి. వెంటనే వారిని కరోనా పరీక్షకు పంపించాలి. టెస్ట్ ఫలితాలు వచ్చే లోపు హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారికి కౌన్సిలింగ్ నిర్వహించాలి. పరీక్ష ఫలితం పాజిటివ్ వచ్చిన వారికి, వారి కుటుంబ సభ్యులకు కరోనా నుంచి బయటపడే విధంగా జాగ్రత్తలు చెప్పాలి. పాజిటివ్ వ్యక్తి ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రోజు పర్యవేక్షించాలి. ఆశా వర్కర్లు ఆ వ్యక్తికి డాక్టర్లతో టెలి కన్సల్టెన్సీ ఏర్పాటు చేయాలి. ఆశావర్కర్లు ప్రతి రోజు హోం ఐసొలేషన్‌లో ఉంటున్న వారికి ఆక్సిజన్ లెవల్స్ చూడాలి,. ఆక్సిజన్ లెవల్స్ తగ్గిన వారిని వెంటనే కొవిడ్ ఆస్పత్రులకు తరలించాలి.