తిరస్కరించిన సాయినాథ్‌

ABN , First Publish Date - 2021-07-08T08:45:18+05:30 IST

ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు సీనియర్‌ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ తెలిపారు

తిరస్కరించిన సాయినాథ్‌

జర్నలిస్టులు ప్రభుత్వ అవార్డులు తీసుకోవద్దని సూచన


అమరావతి, జూలై 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన వైఎస్సార్‌ జీవిత సాఫల్య పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు సీనియర్‌ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ రంగాలకు ప్రకటించిన అవార్డుల్లో పాత్రికేయ రంగం నుంచి సాయినాథ్‌ను ఎంపిక చేశారు. అయితే.. ఈ అవార్డును తాను స్వీకరించబోనని సాయినాథ్‌ ట్వీట్‌ చేశారు. కళాకారులు, క్రీడాకారులు సహా ఇతర రంగాలతో పోల్చితే జర్నలిస్టుల పాత్ర భిన్నమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విమర్శించే పాత్ర ఇతర రంగాలకు భిన్నంగా పాత్రికేయులపై ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులను తీసుకోరాదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని పేర్కొన్నారు.  

Updated Date - 2021-07-08T08:45:18+05:30 IST