ఒమ్మంగిలో అమ్మాయిలతో ఎమ్మెల్యే మేనల్లుడి రికార్డింగ్ డ్యాన్స్

ABN , First Publish Date - 2021-01-14T02:47:48+05:30 IST

గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే ఇంతకుమించి అన్నట్టుగా తూర్పుగోదారి జిల్లా పత్తిపాడులో...

ఒమ్మంగిలో అమ్మాయిలతో ఎమ్మెల్యే మేనల్లుడి రికార్డింగ్ డ్యాన్స్

రాజమండ్రి: గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. ఇందులో పెద్దగా ఆశ్చర్యమేమీ లేదు. కాకపోతే ఇంతకుమించి అన్నట్టుగా తూర్పుగోదారి జిల్లా పత్తిపాడులో రికార్డింగ్ డ్యాన్సులు నిర్వహిస్తున్నారు. పత్తిపాడు మండలం ఒమ్మంగిలో స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మేనల్లుడు చినబాబు, ఇతర వైసీపీ నేతలు అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా వారితో కలిసి చిందులు వేశారు. ఇంతజరుగుతుంటే ఖాకీలు పత్తాలేకుండా పోయారు. కోడి పందేలను అడ్డుకుంటామని ప్రకటించిన పోలీసులు ఎక్కడా కనిపించలేదు. 


Updated Date - 2021-01-14T02:47:48+05:30 IST