ఎన్జీటీలో రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ

ABN , First Publish Date - 2021-08-27T20:16:42+05:30 IST

న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుందని...

ఎన్జీటీలో రాయలసీమ ఎత్తిపోతలపై విచారణ

న్యూఢిల్లీ: రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతుల కోసం ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుందని ఎన్జీటీకి కేంద్రం తెలియజేసింది. రాయలసీమ ఎత్తిపోతల పనుల తనిఖీల నివేదికను ఎన్జీటీకీ కేఆర్ఎంబీ సమర్పించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి శుక్రవారం ఎన్జీటీలో విచారణ జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పర్యావరణ అనుమతులపై తమ వైఖరి తెలిపేందుకు..వారం రోజుల గడువు కావాలని కేంద్ర అటవీ పర్యావరణశాఖ కోరింది. కేఆర్‌ఎంబీ నివేదికలోని అంశాలను పరిశీలించిన ఎన్జీటీ...కోర్టు ధిక్కరణ అంశానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలో సూచించాలని పిటిషనర్లను కోరుతూ.. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 8కి వాయిదా వేసింది.

Updated Date - 2021-08-27T20:16:42+05:30 IST