పులివెందుల, జమ్మలమడుగు ఇన్‌చార్జిగా రవి

ABN , First Publish Date - 2021-02-06T09:53:41+05:30 IST

సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో పార్టీ బలోపేతం దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు.

పులివెందుల, జమ్మలమడుగు ఇన్‌చార్జిగా రవి

అమరావతి, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ సొంత జిల్లా కడపలో పార్టీ బలోపేతం దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయాలు తీసుకున్నారు. పుులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలకు పార్టీ ఇన్‌చార్జిగా ఎమ్మెల్సీ బీటెక్‌ రవిని నియమించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ తరపున పోటీ చేసిన సతీశ్‌రెడ్డి, రామ సుబ్బారెడ్డి కొన్నాళ్ల కిందట వైసీపీలో చేరారు. ఈ నేపథ్యంలో జమ్మలమడుగు నియోజకవర్గం పార్టీ నేతలు చంద్రబాబును శుక్రవారం కలిశారు. 

Updated Date - 2021-02-06T09:53:41+05:30 IST