ఆయన కంట తడి పెట్టుకోవడం దురదృష్టకరం: బీజేపీ నేత
ABN , First Publish Date - 2021-11-21T19:16:08+05:30 IST
ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఇటువంటి నీచమైన దిగజారుడు రాజకీయాలు రాష్ట్రానికి మంచిదికాదని బీజేపీ నేత రావెళ్ల కిషోర్ బాబు అన్నారు.

ప్రకాశం: ఏపీ అసెంబ్లీలో జరిగిన సంఘటన దురదృష్టకరమని, ఇటువంటి నీచమైన దిగజారుడు రాజకీయాలు రాష్ట్రానికి మంచిదికాదని బీజేపీ నేత రావెళ్ల కిషోర్ బాబు అన్నారు. ఒక సీనియర్ రాజకీయ నాయకుడు కంట తడి పెట్టుకోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. దిగజారుడు రాజకీయాలు మానుకోని రాష్ట్రానికే పెద్దసమష్యగా మారిన రాజదానిపై చట్టసభల్లో చర్చించి సమస్యను పరిష్కరించాలని సూచించారు. రాజధానికోసం అందరు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. బీజేపీ వందకు వంద శాతం రాజధాని విషయంలో కట్టుబడి ఉందని, అమరావతి రాజదానిని సాదించుకోని తీరుతామని స్పష్టం చేశారు.