ఉద్యోగులపై కారం జల్లిన రేషన్ డీలర్

ABN , First Publish Date - 2021-10-26T02:09:15+05:30 IST

తమ విధులు నిర్వహించడానికి వచ్చిన ఉద్యోగులపై రేషన్

ఉద్యోగులపై కారం జల్లిన రేషన్ డీలర్

రాజమండ్రి: తమ విధులు నిర్వహించడానికి వచ్చిన ఉద్యోగులపై రేషన్ డీలర్ కారం జల్లింది. తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలం నదురుబదలో ఉద్యోగులపై రేషన్ డీలర్ మిర్తిపాటి జ్యోతిలక్ష్మి కారం జల్లింది. జ్యోతిలక్ష్మి నుంచి రేషన్ షాపును లలిత మహిళా శక్తి సంఘానికి చెందిన పున్నపి పావనికి అప్పగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు రేషన్ షాపును స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నించారు. దీంతో షాపునకు గేటు వేసుకొని సచివాలయ సిబ్బంది, కానిస్టేబుల్’పై జ్యోతిలక్ష్మి కారం జల్లింది. 


Updated Date - 2021-10-26T02:09:15+05:30 IST