అత్యాచార నిందితుడు అరెస్టు

ABN , First Publish Date - 2021-08-21T08:57:16+05:30 IST

గుంటూరు జిల్లా రాజుపాలెంలో మానసిక దివ్యాంగురాలైన దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అత్యాచార నిందితుడు అరెస్టు

రాజుపాలెం ఘటనపై పోలీసుల ప్రకటన

గుంటూరు, ఆగస్టు 20: గుంటూరు జిల్లా రాజుపాలెంలో మానసిక దివ్యాంగురాలైన దళిత బాలికపై జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. గురువారం దిశ పోలీసులు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకుని, ఆ వెంటనే నిందితుడు గళ్లా లాబాన్‌ను(32) అరెస్టు చేసినట్టు గుంటూరు రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్నీ మీడియాకు తెలిపారు. ‘‘నిందితుడు లాబాన్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశాం. అతడికి, అనుమానంపై అదుపులోకి తీసుకున్న ఆటోడ్రైవర్‌ సంజీవకుమార్‌కు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహిస్తాం’’ అని ఎస్పీ తెలిపారు. కాగా, వరుసకు బంధువయ్యే బాధితురాలిపై 15 రోజుల క్రితం కూడా ఒకసారి లాబాన్‌ అత్యాచార యత్నం చేసినట్టు దర్యాప్తులో తేలిందన్నారు. 

Updated Date - 2021-08-21T08:57:16+05:30 IST