బడ్జెట్లో రూ. 40 లక్షలు కేటాయించడం..ఏపీని అవమానించడమే: రామ్మోహన్ నాయుడు
ABN , First Publish Date - 2021-12-09T20:33:51+05:30 IST
ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని రామ్మోహన్ నాయుడు ప్రశ్నించారు.

న్యూఢిల్లీ: ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రైల్వే జోన్ హామీని ఎప్పుడు పూర్తి చేస్తారని గురువారం లోక్సభలో టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కేంద్రాన్ని ప్రశ్నించారు. మూడేళ్లు అవుతున్నా ఇంతవరకు పురోగతి లేదన్నారు. బడ్జెట్లోనూ కేవలం రూ. 40 లక్షలు కేటాయించడం.. ఏపీని అవమానించడమేనని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు.