ఆ దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా?: రామ్మోహన్ నాయుడు

ABN , First Publish Date - 2021-05-30T17:27:37+05:30 IST

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఆ దమ్ము వైసీపీ ఎంపీలకు ఉందా?: రామ్మోహన్ నాయుడు

అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్‌లో తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఢిల్లీ మెడలు వంచుతానని శపధాలు చేసి, అక్కడికెళ్లి కాళ్ళు మొక్కుతోంది ఎవరో, ఎందుకో అందరికీ తెలుసునని అన్నారు. పార్లమెంట్‌లో 28 మంది ఎంపీలు ఉన్నా, ఒక్కరు కూడా అక్కడ గొంతెత్తి ప్రశ్నించడంలేదని దుయ్యబట్టారు. ప్రతిపక్షం సమావేశాల్లో ఎమీ మాట్లాడలేదంటూ దద్దమ్మ కబుర్లు చెపితే, మీ వెర్రితనం చూసి జనాలు నవ్విపోతారన్నారు. 28 మంది ఎంపీలు ఉన్నారుకదా, వచ్చే పార్లమెంట్ సెషన్లో విశాఖ స్టీల్ ఫ్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా తీర్మానం పెట్టే దమ్ము మీకుందా? అని సవాల్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టి, ఆ తీర్మానానికి మనస్పూర్తిగా మద్దతు ఇచ్చే చిత్తశుద్ధి తమకుందని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

Updated Date - 2021-05-30T17:27:37+05:30 IST