విజయసాయిరెడ్డి బుద్ధిహీనుడు: రమేష్‌నాయుడు

ABN , First Publish Date - 2021-02-09T00:51:33+05:30 IST

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుద్ధిహీనుడని బీజేపీ నేత రమేష్‌నాయుడు ఎద్దేవ చేశారు.

విజయసాయిరెడ్డి బుద్ధిహీనుడు: రమేష్‌నాయుడు

అమరావతి: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బుద్ధిహీనుడని బీజేపీ నేత రమేష్‌నాయుడు ఎద్దేవ చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో ఎలా ప్రవర్తించాలో..కనీస జ్ఞానం లేని విజయసాయిరెడ్డి పెద్దల సభకు అనర్హుడని రమేష్‌నాయుడు తెలిపారు. వెంకయ్యనాయుడికి  వెంటనే  విజయసాయిరెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారికి, కోర్టులకు కూడా.. తమ కంపు పూయడానికి వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని రమేష్‌నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-02-09T00:51:33+05:30 IST