భారత్ బంద్‌కు సహకరించాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-03-21T18:27:57+05:30 IST
ప్రభుత్వ ఆస్తులను కేంద్రం ప్రైవేట్ వ్యక్తులకు దోచి పెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుంటూరు: ప్రభుత్వ ఆస్తులను కేంద్రం ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 26న జరగనున్న భారత్ బంద్ ప్రచార కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా అన్ని సంఘాలు కలిసి భారత్ బంద్ నిర్వహిస్తున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ బంద్‌కు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. రైతుల ఉద్యమం చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదని రామకృష్ణ మండిపడ్డారు.