10 లోపు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-07-24T15:24:14+05:30 IST
ఆగస్ట్ 10 లోపు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. లేకుంటే మరో ఉద్యమానికి సీపీఐ సిద్ధమన్నారు.

అమరావతి: ఆగస్ట్ 10 లోపు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వానికి సూచించారు. లేకుంటే మరో ఉద్యమానికి సీపీఐ సిద్ధమన్నారు. వరద ముంపు భూములను పేదల ఇళ్ల స్థలాల కోసం ఇవ్వడం సరికాదన్నారు. పేదల ఇళ్ల స్థలాల్లో ప్రభుత్వమే గృహాలను నిర్మించి ఇవ్వాలని రామకృష్ణ కోరారు.